హరితహారానికి ఏర్పాట్లు చేయాలి


Sun,July 7, 2019 01:29 AM

నీలగిరి: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా మండల, గ్రామ స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో హరితహారంలో భాగంగా 4.2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా వివిధ శాఖలకు పట్టణ, గ్రామీణ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. అధికారులు తమ లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటాలని, వివరాలను అటవీ శాఖ వైబ్‌సైట్ tgfmis లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 కంటే ఎక్కువ మొక్కలు నాటితే ఉపాధిహామీ పథకం కింద మ్కొల వాచ్ అండ్ వార్డు నిర్వహిస్తారని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు పొలం గట్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఎంపీడీఓలు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను అధిగమించాలన్నారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్ధలాలు, పంచాయతీరాజ్ రహదారులు, ఆర్‌అండ్‌బి రహదారులువెంబడి విద్యా సంస్ధలు, పరిశ్రమలు, అటవీ స్ధలాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి అన్ని ఏర్పాట్లు చేయాలని అదేశించారు.ప్రభుత్వం పర్యావరణాన్ని సంరక్షించి పచ్చదనం పెంపోందించేందుకు హరితహారం కార్యక్రమం ప్రారంభించిదని, ఆడవుల శాతం 33 ఉండేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదోడ్లు నిర్మాణాలు పూర్తి చేసిన వాటి సంబందించి యూసీలు, నిర్మాణాలకు సంబందించిన ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ శాంతారాం, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...