టీఆర్‌ఎస్‌తోనే బంగారు భవిష్యత్తు


Sun,July 7, 2019 01:29 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్‌తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, అమలువుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, మాజీ జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు హన్మంతు వెంకటేష్ గౌడ్, నాయకులు చీదెళ్లగోపి, ఖాదర్ బాబా, ఇలియాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే కంచర్ల
పానగల్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, అందుకే వివిధ వర్గాల వారు పార్టీలో భారీగా చేరుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యత్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని రవీంద్రనగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కేవలం నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదులో నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు చీర పంకజ్ యాదవ్, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, జిల్లా నాయకులు మందడివ సైదిరెడ్డి, పట్టణ నాయకులు వీరమల్ల భాస్కర్, ఉప్పల కృష్ణ, ఆకుల శేఖర్, తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...