ఆశాజ్యోతి సీఎం కేసీఆర్


Sun,July 7, 2019 01:28 AM

శాలిగౌరారం: బడుగు, బలహీన వర్గాల అశాజ్యోతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. వారి అభివృద్ధికోసం నిత్యం పాటుపడే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధ్దులకు, వికలాంగులకు పెంచి ఇస్తామన్న ఆసరా పింఛన్లను పెంచి అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రజల ఆధరాభిమానాలు చూరగొన్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఐదేండ్ల తదుపరి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గతం కంటే మిన్నగా పార్టీని ఆశీర్వదించి, అధికారాన్ని అప్పగించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రజలు చూపిన ఔదర్యాన్ని టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నడూ మరిచిపోదని, గంతలో కంటే ఎక్కువ రెట్లు పని చేసి ప్రజలకు మరింత మేలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకుపోవడంతో పాటు, అవినీతి రహిత తెలంగాణగా మార్చాలని భావిస్తున్నారన్నారు. పారదర్శకమైన పాలన కోసం కేసీఆర్ పరితపిస్తున్నారని వెల్లడించారు. దేశం అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో పాటు, కోటి ఎకరాల మాగాణికి నీరందించనున్నారన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని ప్రతీ కార్యకర్త తీసుకొని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని విజ్ణప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు చామల సుదర్శన్‌రెడ్డి, బాకి వెంకటయ్య, శాగంటి యాదగిరి, గిరగాని జయప్రకాశ్, మోత్కూరి శంకర్, వీరస్వామి పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...