సమస్యలను బాధ్యతగా స్వీకరించి.. పరిష్కరిస్తా


Sun,July 7, 2019 01:28 AM

చిట్యాల : ప్రజా సమస్యలను బాధ్యతగా స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వైకుంఠదామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. వాటిని పరిష్కరించి అక్కడ మౌలిక వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చా రు. అనంతరం అంబేద్కర్‌నగర్, శివాల యం వీధి, బొ డ్రాయి బజార్‌లలోని పలు ప్రాంతాలలో పర్యటించి అక్క డి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తానని హా మీ ఇచ్చారు. సీసీ రోడ్ల కన్నా మురుగు కాలువల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చి నిర్మిస్తానని అన్నారు. శివాలయం వీధితోపాటు అంబేద్కర్‌నగర్‌లోని పలు వీధులలో ము రుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉండటంతో అక్కడి మహిళలు ఆ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే వాటి పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. ఏ యే ప్రాంతాలలో మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలో ఆ ప్రాంతాలను వెంటనే పీఏకు చెప్పి నమోదు చేయించారు. యల్లమ్మ గుడి ప్రాంతంలో ఓ వెంచర్ నిర్మాహకులు నిర్మిస్తున్న మురుగు కాలువను పరిశీలించి అక్కడి అవసరాలకు అనుగుణంగా లేదని, ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, అధికారుల అనుమతితో నిర్మించాలని సూ చించారు. ఈద్గా వద్దకు మెట్లు నిర్మించాలని ముస్లిం లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పాటి నర్సిరెడ్డి, బెల్లి సత్తయ్య, రెముడాల మల్లేశం, ఎద్దులపురి కృష్ణ, గంటెపాక స్వామి, కొలను సతీష్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, వేలుపల్లి మధుకుమార్, తోకల నరేందర్‌రెడ్డి, సాగర్ల గోవర్దన్, ఎస్‌కే అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...