క్షయ వ్యాధిపై విసృత ప్రచారం నిర్వహించాలి


Sun,July 7, 2019 01:28 AM

నీలగిరి : క్షయవ్యాధిపై ప్రజల్లో విసృత ప్రచారం నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోనేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అన్నిమళ్ల కొండల్‌రావు సూచించారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో టీబీ సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టీబీ, మలేరియా, ఎయిడ్స్ అనీమియా తగ్గడానికి ల్యాబ్ టెక్నీషియన్ల కృషి మాత్రమే కారణమన్నారు. జిల్లాలో 2395 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని, డీఓటీ ద్వారా మందులు వాడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్షయవ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నారా లేదా అనే విషయం సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. డీఓటీ పనితీరును చూడడం, ఫెయిల్యూర్ కేసులను గమనించడం, పాజిటీవ్ కేసులను ముందుగా గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఆశవర్కర్లలకు, ఎస్‌టీఎస్, ఎస్‌టీఎల్‌ఎస్‌లకు రావాల్సిన జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉన్నతాధికారులతో మాట్లాడి విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సమావేశంలో క్షయనివారణ అధికారి కల్యాణచక్రవర్తి, బిరుదుల వెంకన్న పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...