ఫీ జులూం


Wed,June 19, 2019 01:48 AM

- ఫీజుల పేరుతో ప్రైవేటు పాఠశాలల దోపిడీ
- అడ్మిషన్, ట్యూషన్, బస్ ఫీజులంటూ వసూళ్లు
- ప్రతి సంవత్సరం 25 నుంచి 30 శాతం పెంపు
- చదువుకు ప్రాధాన్యతనిచ్చే తల్లిదండ్రులే లక్ష్యం
- వసూళ్ల వివరాలు సైతం బహిరంగ పర్చని వైనం

రామగిరి: విద్య పేదోడికి అందని ద్రాక్షలా మారుతోం ది. దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో ప్రైవే టు కార్పొరేట్‌స్థాయి పాఠశాలలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. నర్సరీలో విద్యార్థిని చేర్చాలంటే రూ.19 వేల నుంచి 22 వేల వరకు ఫీజును యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అయితే హైదరాబాద్ రోడ్డులోని ఒక ప్రముఖ స్కూల్‌లో నర్సరీకే రూ.45 వేల ఫీజు ఉండటం విశేషం. ఈ ఫీజుల దందా తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతోంది.

జీఓలు వచ్చినా అంతంతే....
ఫీజుల నియంత్రణకు డీఎఫ్‌ఆర్‌సీ (డిస్ట్రిక్టు ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ)తోపాటు విద్యా హక్కు చట్టం కూడా అమలులో ఉంది. 2009లోనే ప్రభుత్వం ఈ ఫీజుల నియంత్రణ కు జీఓలను సైతం జారీ చేసింది. అదేవి ధంగా 2011లో విద్యాహక్కు చట్టం ప్రకారం నిబంధనలు రూపొందించి అమలులోకి తెచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణను అమలు చేయాలని పలు సంఘాలు సూచించాయి. అయినా నేటికీ చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి.

నోటీసు బోర్డుల్లో కనిపించని ఫీజులు....
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి కచ్చితంగా తరగతుల వారీగా ఫీజుల వివరాలను తెలుపుతూనోటీసు బోర్డును ఉంచాలి. అంతేగాకుండా తల్లిదండ్రులతో ఫీజుల కమిటీని సైతం వేసి వారి నిర్ణయం మేరకు ఫీజులను అమలు చేయాల్సి ఉంది. అయితే ఇదేమి పట్టకుండా ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. అంతేగాకుం డా కొన్ని ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, బస్ ఫీజు అంటూ వేర్వేరుగా వసూళ్లు చేస్తున్నా రు. తాజాగా జూన్ 12 నుంచి వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తిరిగి తెరిచిన తర్వాత నమస్తే తెలంగాణ జరిపిన క్షేత్ర పరిశీలన జరిపిన ఒక్క పాఠశాలలోనూ ఫీజు ల వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న మౌంట్ లిటెరా జీ స్కూల్, విపశ్య స్కూళ్లలో అడ్మిషన్ తీసుకోవడానికి డాటాఫామ్ పూర్తి చేస్తేనే కానీ ఫీజు ల వివరాలు వెల్లడించని పరిస్థితి నెలకొంది. నమస్తే జరిపిన పరిశీలనలో.. శ్రీ చైతన్య టెక్నో స్కూల్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, నారాయణ హైస్కూల్, ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ వంటి పలు పాఠశాలల్లోనూ ఎక్క డా ఫీజుల వివరాలు బహిరంగంగా నోటీసు బోర్డులో ఉంచలేదు.

జీఓ 42 ప్రకారం ఫీజులు ఇలా ఉండాలి...
ప్రభుత్వం జీఓ 41, 42ను ఫీజుల కోసం జారీ చేసిం ది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ. 9వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.7800 వసూ లు చేయాలి. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో అయితే రూ.12 వేలు, గ్రామాల్లో అయితే రూ. 10,800 మించి వసూలు చేయడానికి వీలు లేదు. కానీ కార్పొరేట్‌స్థాయిలో పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టాన్ని తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ణయిస్తూ వసూలు చేస్తున్నారు.

నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలి
ప్రభుత్వం జారీ చేసిన ని బంధనల మేరకు ఫీజుల ను కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చే యాలి. విద్యాహక్కు చ ట్టం ప్రకారం కచ్చితంగా అన్ని పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బో ర్డుల్లో ఉంచాలి. త్వరలోనే పాఠశాలలను తనిఖీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధ్దంగా వ్యవహరిస్తున్నట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
-డీఈఓ పి.సరోజినీదేవి

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...