11లక్షల మొక్కలు నాటాలి


Wed,June 19, 2019 01:47 AM

- జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి

మునుగోడు: మండలంలోని నర్సరీల్లో అన్నిరకాల మొక్కలను సక్రమంగా పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలపరిధిలోని రత్తుపల్లి, జమస్థాన్‌పల్లి, కొరటికల్ గ్రామాల్లో నర్సరీలను, పులిపలుపుల గ్రామంలో చేపల చెరువులు, కుంటల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 1 నాటికి అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంచాలని, హరితహారం కార్యక్రమం కింద మండలవ్యాప్తంగా 11లక్షలకుపైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములతోపాటు రైతుల భూముల్లో మొక్క లు నాటేందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటేందుకు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆయనవెంట ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు నాగరాజు, నాగయ్య, అశోక్, నాగమణి ఉన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...