కులవృత్తులకు ప్రాధాన్యం సీఎం కేసీఆర్ ఘనతే


Wed,June 19, 2019 01:47 AM

సూర్యాపేట టౌన్ : గత ఉమ్మడి నిర్లక్ష్య పాలనలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక అనేక వృత్తులు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయని.. అటువంటి పరిస్థితిని పూర్తిగా రూపుమాపి కులవృత్తిదారుల ఆత్మగౌరవం పెంపొందేలా అన్ని కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఉమ్మ డి జిల్లా గొర్రెల, మేకల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ పోలెబోయి న నర్సయ్య యాదవ్ అన్నారు. మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందరి కష్టాలెరిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేస్తూ అందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. గతంలో గొర్రెలు, మేకలకు ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఈ మందులను అందజేయగా తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ప్రతిఏటా 3సార్లు క్రమం తప్పకుండా పూర్తి ఉచితంగా మందులు, వ్యాక్సిన్ అందిస్తున్నారన్నారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం సంచలానత్మకంగా ప్రారంభించిన 75శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసిన నాటినుంచి ఎంతో మంది పెంపకం దారులు వీటి ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ నెల 25వరకు జరుగనున్న మందుల పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పోలెబోయిన రాధికనర్సయ్యయాదవ్, వైద్యులు డాక్టర్ జానయ్య, డాక్టర్ గౌతమ్, డాక్టర్ సౌమ్య, రెడ్డెబోయిన లింగయ్య, ఆవుల యాదగిరి, గంగుల వెంకన్న, కూసుకుంట్ల మల్సూర్, బత్తుల యాదగిరి పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...