సాగర్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందం


Wed,June 19, 2019 01:47 AM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగర్జునసాగర్‌లోని బుద్ధవనం, నాగార్జునకొండ, నాగార్జునసాగర్ డ్యాంను 2018 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు ఆదర్శ్ సురభీ, అనుదీప్ దురిశెట్టి, శశిధర్‌రావు, కుమార్‌దీపక్, మాసంధ మగ్ధాలీన్ పెటీన్, తెజష్ నందలాల్ పవార్, ఆరుగురు సభ్యుల బృందం మంగళవారం సందర్శించారు. హిల్‌కాలనీలోని శ్రీపర్వతారామం(బుద్ధవనం) చేరుకొని మ్యూజియంలో, గోపురంపైన అమర్చిన శిల్పాలను, స్థూపపార్కు, ధ్యానవనం, బుద్ధచరితవనం, మహాస్థూపపార్కు, మహాబుద్ధస్థూపం ప్రాంతాలను పరిశీలించారు. గౌతమబుద్ధుడి నేలగా భావించే బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలంగాణ టూరిజం ఏర్పాటుచేసిన లాంచీలో నాగార్జునకొండకు బయలుదేరి గౌతమ బుద్ధునికి, నదీలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను తెలిపే మ్యూజియం, వెలుపలగల యజ్ఞశాల, చైత్యాలు, అశ్వవేదయాగశాల, నేలపై అలనాడు ఇటుకలతో ఏర్పాటుచేసిన స్వస్తిక్ గుర్తు, సింహల విహారంలో ఎత్తైన బుద్ధుని విగ్రహం ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం నాగార్జునసాగర్ డ్యాంను, క్రస్ట గేట్ల, గ్యాలరీను సందర్శించారు.

ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు మాట్లాడుతూ సాగర్‌లోని అలనాటి గౌతమ బుద్ధుడు నేలగా ప్రసిద్ధిచెందిన నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జునకొండ, బుద్ధవనంలతో నాగార్జునసాగర్‌కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. అంతకుముందు హిల్‌కాలనీ విజయవిహార్‌కు చేరుకున్న ట్రైనీ ఐఏఎస్‌లకు రెవెన్యూ ఎన్నెస్పీ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వీరితో ఆర్‌డీవో జగన్నాధరావు, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, డీటీవో శివాజ్, ఎన్నెస్పీ ఈఈ నాగేశ్వరరావు, డీఈలు విజయ్‌కుమార్, సుదర్శన్, సల్మాన్‌రాజ్, డీటీసీఎస్ శరత్‌చంద్ర, బుద్ధవనం డిజైనర్ ఇన్‌చార్జ్ శ్యామ్‌సుందర్, ఏఈ జగదీష్, ఎస్‌ఐ శీనయ్య, గైడ్ సత్యనారాయణ, హనుమంతురావు తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...