ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య


Tue,June 18, 2019 02:20 AM

విద్య ప్రాముఖ్యతను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్
కేజీ టూ పీజీలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల ఏర్పాటు
బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
గురుకుల పాఠశాలను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
చివ్వెంల :విద్య ప్రాముఖ్యతను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్.. ప్రతీ ఒక్కరికీ ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో కేజీ టూ పీజీలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించుకుంటున్నాం.. బడుగు, బలహీనవర్గాల పిల్లలు సైతం ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆలోచనతో ముందుకుసాగుతున్నాం.. అని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం చివ్వెంల, హుజూర్‌నగర్‌లో బీసీ గురుకుల పాఠశాలలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 119 గురుకులాల ప్రారంభోత్సవం జరగడం గర్వకారణమన్నారు. ప్రిన్సిపాల్ మొదలుకుని భోజనం వడ్డించే సిబ్బంది వరకు ప్రతి విద్యార్థిని సొంత పిల్లల్లా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు హాజరుకానున్న విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం రామాపురంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ గురుకులాన్ని ప్రారంభించారు.

విద్య ప్రాధాన్యతను గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేం ద్రంలో ఆత్మకూర్.ఎస్ మండల బీసీ గురుకుల బాలుర పాఠశాల ప్రారంభోత్సవంలో మాట్లాడారు. 2013వ సంవత్సరంలోనే విద్యా ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యా ఏ విధంగా ఉండాలనే విషయంలో సీఎం కేసీఆర్ ఆనాడే 2014 మ్యానిఫెస్టోలో చేర్చారన్నారు. కే జీ టూ పీజీ వరకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి పిల్లలను తల్లిదండ్రులను కాపాడుకోవాలంటే అదే స్థాయిలో ప్రభుత్వ విద్య ఉండాలని ముందే గుర్తించారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 281 లకు పైగా గురుకుల పాఠశాలలు ఎవరూ ఊహించని విధంగా ఏర్పాటు చేశారన్నారు. గతంలో మంత్రి, ఎమ్మెల్యే సంవత్సరం పాటు ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఒక్క కళాశాల, పాఠశాల వచ్చేది కాదన్నారు.

ఇప్పుడు అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలో తప్పకు ండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల లు తప్పకుండా ఉండాలని గురుకులాల ఏ ర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వచ్చిన 91వేల 500ల మంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో పాఠశాల ప్రిన్సిపల్ నుంచి వడ్డించే సిబ్బంది వరకు తమ వంతు బాధ్యతగా పని చే యాలన్నారు. గురుకులాల ఏర్పాటుపై తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై విశ్వాసం, భరోసా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అంతకు ముందు కలెక్టర్ అమయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీసీ గురుకుల పాఠశాల ప్రారంభం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా జ్యోతి బాపూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి జ్యోతి, డీఆర్‌ఓ చం ద్ర య్య, ఆర్‌సీఓ షకీనా, ఉమ్మడి జిల్లా జడ్పీ కో-అప్షన్ సభ్యడు ఎస్.కే.బాషా, రౌతు నర్సింహ్మరావు, జూలకంటి సుధాకర్‌రెడ్డి, పోలెబోయిన న ర్సయ్యయాదవ్, జూలకంటి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...