ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Tue,June 18, 2019 02:20 AM

-ప్రైవేటుకు దీటుగా మౌలిక వసతులు
-ప్రతిభ కనబర్చే విద్యార్థులకు ఉపకార వేతనాలు
- డీఈఓ సరోజినీదేవి
మిర్యాలగూడ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాధికారి (డీఈఓ) సరోజినీదేవి అన్నారు. మండల పరిధిలోని దొండవారిగూడెంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ప్రొ.జయశంకర్‌సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ పాల్గొని చిన్నారులతో అక్షరాలు రాయించి దిద్దించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేస్తుందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లేని మౌలిక సదుపాయాలు ప్ర భుత్వ పాఠశాలల్లో ఉన్నాయన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్నం సన్న బియ్యంతో నా ణ్యమైన భోజనం పెట్టడం జరుగుతుందన్నారు. బాగా చదివే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందజేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారెందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చిన్నారులను చేర్పించి ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడకుండా వారి ఉన్నత భవిష్యత్‌కై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జగన్నాథరావు, ఎంపీపీ నూకల సరళ, జడ్పీటీసీ మిట్టపల్లి నాగలక్ష్మీ, సర్పంచ్ సుజాత రమణ, రాఘవారెడ్డి, రవికుమార్, జానయ్య, ఎంఈఓ బాలాజీనాయక్, ప్రధానోపాధ్యాయుడు అంజన్‌రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...