సామాన్యుడిలా సమస్యలపై ఆరా..


Tue,June 18, 2019 02:18 AM

చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే సరికొత్త పంథాను ఎంచుకున్నారు. చాయ్‌పే చర్చ అంటూ సాధారణ పౌరుడిలా సోమవారం ఓ టీ కొట్టులో కూర్చొని అది అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజలతో ముఖాముఖి నిర్వ హించారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పొద్దున్నే టీ కొట్టులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యేను చూసి కొట్టు యజమాని, అక్కడ టీ తాగటానికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. హోటల్‌లో ఓ టీ ఆర్డర్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలోని తాగునీటి సమస్యపై వాకబు చేశారు. ఈనెల 13న నిర్వహించిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పక్కా ప్రణాళిక రూపొందిస్తామని, ఎవరూ నిర్లక్ష్యం వహించినా సహించబోనని, రెగ్యులర్‌గా మున్సిపాలిటీ పరిధిలో పర్యటిస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఆ దిశగా తొలి అడుగువేశారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...