పేద విద్యార్థుల అభివృద్ధికే గురుకులాలు


Tue,June 18, 2019 02:17 AM

- బీసీ గురుకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
-గురుకులాల్లో గుణాత్మక విద్య : కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
రామగిరి: పేద విద్యార్థులు విద్యారంగంలో అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను అన్నివర్గాల విద్యార్థులకు ప్రారంభించిందని, సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యతనిస్తు దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని సాగర్‌రోడ్డులో గల రామానంద తీర్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించిన మహాత్మజ్యోతిరావుపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన గురుకుల పాఠశాలను సోమవారం కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నివర్గాల పిల్లలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తు విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీంపాష, వైస్ ఎంపీపీ ఆర్. శ్రీధర్‌రావు, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, టీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షులు అబ్బగోని రమేష్, కౌన్సిలర్‌రావుల శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పిల్లిరామరాజు, ఇస్లాంనగర్ సర్పంచ్ హేమ్లానాయక్, సహదేవరెడ్డి, రవీందర్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, జిల్లా శంకర్, స్వరూప, సైదిరెడ్డి పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...