చందంపేట ఎంపీపీగా నున్సావత్‌ పార్వతి


Sun,June 16, 2019 02:49 AM

చందంపేట : ఎంపీపీగా తెల్‌దేవర్‌పల్లి ఎంపీటీసీ నున్సావత్‌ పార్వతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. గత నెల 7వ తేదీన నిర్వహించాల్సిన ఎన్నిక కోరం లేక వాయిదా పడటంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శనివారం ఎన్నికల అధికారులు వెంకటేశ్వర్లు, బాలు, రాములు నాయక్‌, విజయేందర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నున్సావత్‌ పార్వతి, వైస్‌ ఎంపీపీగా చిత్రియాల ఎంపీటీసీ జాల ప్రేమలత, కో-ఆప్షన్‌ సభ్యునిగా సాదిఖ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు, చందంపేట ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికైన వారికి అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...