నేడు బీఆర్‌ఏఓయూ డిగ్రీ, బీఈడీ అర్హత పరీక్షలు


Sun,June 16, 2019 02:48 AM

రామగిరి: ఎలాంటి విద్యార్హత లేకున్నా డా. బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ‘ డిగ్రీ అర్హత పరీక్ష-2019’ ఆదివారం జరుగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 అధ్యయన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ అర్హత పరీక్షతో పాటు బీఈడీ, స్పెషల్‌ బీఈడీ అర్హత పరీక్షలు సైతం జరుగనున్నాయి. పరీక్షల ఏర్పాట్లను యూనివర్సిటీ నల్లగొండ రీజనల్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డా. బి.ధర్మానాయక్‌ పర్యవేక్షించారు. బీఈడీ, డిగ్రీ అర్హత పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. స్పెషల్‌ బీఈడీ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతుంది. బీఈడీకి 156 మంది, స్పెషల్‌ బీఈడీకి 37 మంది హాజరవుతుండగా డిగ్రీ అర్హతా పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 600 మంది హాజరవుతున్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...