ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధన


Sat,June 15, 2019 12:18 AM

హాలియా, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, ఉత్తమ విద్యాబోధన లభి స్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ య్య అన్నారు. హాలియా పట్టణంలో శుక్రవారం నిర్వహిం చిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం సర్కార్ బడులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతుందన్నారు. పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లను నియమించి విద్యార్థ్ధులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, సన్నబియ్యంతో మ ధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలను అందిస్తుందన్నారు. మంచి వసతులతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పి ంచాలని ఆయన కోరారు. ఎంఈఓ తరి రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, అనుముల ఎంపీపీ అల్లి నాగమణి పెద్దిరాజు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణమూర్తి, ఎంపీటీసీలు చెరుపల్లి ముత్యాలు, మాకమల్ల జంగయ్య, పీఈడీ కె. వెంకటరాంరెడ్డి, నాయకులు పోశం శ్రీనివాస్‌గౌడ్, కొమ్మనబోయిన చంద్రశేఖర్‌గౌడ్, మాదవరం నరేందర్‌రావు, బాబొద్దిన్, సురభి రాంబాబు, దోరెపల్లి వెంకటేశ్వర్లు, బందిలి పెదసైదులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...