రక్తదాతలు సమాజానికి ఆదర్శం


Sat,June 15, 2019 12:17 AM

నీలగిరి : రక్తదాతలు సమాజానికి ఆదర్శమని.. ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ భవన్‌లో ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలు, ప్రోత్సాహకులను మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఐఎంఏ, రక్తదాతలను గుర్తించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావని, జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తదాన ప్రోత్సాహకులు, రక్తదాతలు చేస్తున్న సేవల వల్ల రెడ్‌క్రాస్ వేలాది మంది ప్రాణాలు కాపాడటం జరిగిందన్నారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా యువత గుర్తించాలని తెలిపారు.

అనంతరం జిల్లా స్థాయి రక్తదాన అవార్డు గ్రహీతలు పైళ్ల శశిధర్‌రెడ్డి, కొండానాయక్, ఆమంచి విజయ్‌కుమార్, ఎం.నగేష్, ఎన్.నగేష్, రుద్రవెంకటేశ్వర్లు, గంజి రాజేందర్, శ్రీరాములు, ఉత్తమ మోటివేటర్స్‌గా అపర్ణ దవాఖాన, పరమ్‌పూజ్యా సోలార్, కీర్తి దవాఖాన, విశ్వాష్ దవాఖాన, అనూస్ క్లీనిక్, సంజీవని పిల్లల దవాఖాన, ఎంజీయూనివర్సిటీ, కేఎన్‌ఎం డిగ్రీకాలేజీ, ఎంఎన్‌ఆర్ యువసేనకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు రక్తదాతలు ఊర శ్రీనివాసులు, గార్లపాటి వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌చైర్మన్ రాజ్‌కుమార్, కోశాధికారి డా. పుల్లారావు, సభ్యులు దశరథ, కోటేశ్వర్‌రావు, శివ పాల్గొన్నారు.


జిల్లాకు 3 రాష్ట్ర స్థాయి అవార్డులు... ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లాకు 3రాష్ట్ర స్థాయి అవార్డులను గవర్నర్ నర్సింహన్ అందజేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని సంస్కృతి హాల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్‌సొసైటీ నల్లగొండకు, ఉత్తమ రక్తదాతగా సిరిగిరి సురేష్‌రెడ్డి, ఉత్తమ రక్తదాన ప్రోత్సాహకుడిగా ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ జ్యోతి ప్రకాష్‌రామన్‌కు అవార్డులను అందజేశారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...