జేఈఈ అడ్వాన్స్‌లో మునగాల విద్యార్థికి 27వ ర్యాంక్


Sat,June 15, 2019 12:17 AM

మునగాల : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో మునగాల మండలం మాధవారం గ్రామానికి చెందిన కందిబండ విశ్వంత్ 27వ ర్యాంకు సాధించాడు. మాధవరం గ్రామానికి చెందిన కందిబండ గురుమూర్తి, పద్మల కుమారుడు విశ్వంత్ శుక్రవారం వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎన్‌టీఏలో దేశవ్యాప్తంగా 100 శాతం స్కాలర్ సాధించిన వారు 24మంది ఉండగా వారిలో తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురిలో విశ్వంత్ ఒక్కరిగా నిలిచారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 08వ ర్యాక్ సాధించాడు. విశ్వంత్ తండ్రి గురుమూర్తి ఆత్మకూర్.ఎస్ మండలం గట్టికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, తల్లి పద్మ చివ్వెంల మండలం వీకేపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. విశ్వంత్ హైదరాబాద్‌లోని చైతన్యనారాయణ(చైనా) కళాశాలలో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం విద్యును అభ్యసించాడు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన విశ్వంత్‌ను పలువురు అభినందించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...