లిక్కి భార్గవికి ఐసెట్‌లో 5వ ర్యాంక్


Sat,June 15, 2019 12:16 AM

కోదాడ రూరల్ : కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన లిక్కి భార్గవి ఐసెట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. తొగర్రాయి గ్రామానికి చెందిన లిక్కి అంజయ్య, రమాదేవిల రెండో కుమార్తె భార్గవి. అంజయ్య మండల పరిధిలోని తొగర్రాయి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి రమాదేవి హౌజ్‌వైఫ్. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సహన గత సంవత్సరం ఐసెట్ 25వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతుంది. రెండో కుమార్తె అయిన లిక్కి భార్గవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్(ఈఈఈ) పూర్తి చేసి ఐసెట్‌లో 5వ ర్యాంకు సాధించింది. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే కళాశాలలో మూడు కంపేనీలకు చెందిన వారు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌కు తాను ఎంపికైనట్లు భార్గవి తెలిపింది. ఎంబీఏ చదువుతూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తానని తెలిపింది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...