నేటి నుంచి పోలీస్ ధ్రువపత్రాల పరిశీలన


Fri,June 14, 2019 03:42 AM

నల్లగొండక్రైం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలు నేటి నుంచి పరిశీలించనున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం చేసిన ఏర్పాట్లను ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ పరీక్షలో అర్హుత సాధించిన జిల్లా అభ్యర్థులంతా నేటి నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించే ధ్రువ పత్రాల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. ధ్రువ పత్రాల పరిశీలనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్ నియామక మండలి ఆదేశాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి రోజు సుమారు వేయి మంది అభ్యర్థుల దృవ పత్రాలు పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచే పరిశీలన ప్రారంభమవుతుందని, అభ్యర్థులకు టోకెన్లు ఇవ్వడం ద్వారా అనుమతి ఉంటుందన్నారు. పత్రాల పరిశీలనకు 20 కౌంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటర్‌కు 5గురు అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థుల వివరాలు ఆర్‌టీఏ అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తారన్నారు. దరఖాస్తు చేసిన సమయంలో ఆన్‌లైన్‌లో పొందు పర్చిన దృవపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్లు, సమగ్రంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 4 నుంచి 10వ తరగతి వరకు బోనఫైడ్, స్టడీ సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్, విద్యార్హత పత్రాలు తీసుకు రావాలని సూచించారు. మొదటి రోజు800, రెండో రోజు 1000 మంది పత్రాలు పరిశీలిస్తామన్నారు. 16వ తేదీ సెలవు ఉంటుందని, 17 నుంచి 19 వరకు రోజుకు 1200 మంది, 20న 942, 21న 1200, 22న 791 మంది అభ్యర్థుల ధ్రువ పత్రాలు పరిశీలిస్తామన్నారు. ఎండ ఉన్నందున అభ్యర్థులు ఇబ్బంది పడకుండా తాగునీటి వసతులు కల్పిస్తున్నామన్నారు. ఎస్పీ వెంట ఇన్‌చార్జి ఏఎస్పీ రమేష్, నాగరాజన్, అతుకూరి రెహమాన్, దయాకర్, ఆర్‌ఐలు వై.వి. ప్రతాప్, శంకర్, నర్సింహాచారి, సర్పజన్‌రాజు, సురేష్ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...