మోగిన బడిగంట


Thu,June 13, 2019 03:27 AM

- జిల్యావ్యాప్తంగా బడిబాట పట్టిన 2,34,502 మంది విద్యార్థులు
- ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు పంపిణీ
రామగిరి : రెండనెలల వేసవి సెలవుల అనంతరం బుధవారం విద్యార్థులు బడిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 2026 పాఠశాలలకు 2,34,502 మంది విద్యార్థులు బడి బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మొదటిరోజే పాఠ్య పుస్తకాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా బడులు తెరుచుకోవడంతో తమ పిల్లలను పాఠశాల దగ్గర దింపడం తదితర పనులతో తల్లిదండ్రులు తీరిక లేకుండా గడిపారు.
తొలిరోజు తరగతి గదుల్లో సందడి... జిల్లా వ్యాప్తంగా 2026 పాఠశాలల్లో తొలి రోజు విద్యార్థులు తరగతి గదుల్లోకి ప్రవేశించడంతో అంతా సందడి వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులు మూగబోయిన బడిగంట పిరియడ్‌కు పిరియడ్‌కు మోగడంతో విద్యార్థులు ఆ వైపుగా కదిలారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఇష్టంతో వాటిని తీసుకుని మురిసిపోయ్యారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...