కమనీయంరేణుకాఎల్లమ్మ కల్యాణం


Thu,June 13, 2019 03:27 AM

కనగల్ : మండలంలోని దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మహార్షిల 18వ అమ్మవారి వార్షిక కల్యాణోత్సవాన్ని బుధవారం మంగళవాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్ఛరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండో రోజు అమ్మవారు జమదగ్ని మహామునీల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కల్యాణ మండపానికి, కోలాట బృందాలు, డప్పుచప్పుళ్ల మధ్య తరలించారు. బ్రహ్మశ్రీ బీటుకూరి విజయసారధి ఆచార్య నాగోజు మాల్లాచారి, చిలుకమర్రి శ్రవణ్ కుమారాచార్యులు కారంపుడి సుదర్శనచార్యులు అర్చకత్వంలో వేద పండితుల బృందంచే కల్యాణ తంతును కనులపండువగా నిర్వహించారు. అమ్మవారికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆలయ చైర్మన్ డాక్టర్ మేక ఉమ్మారెడ్డి, ఈఓ కేపీ సత్యమూర్తితో కలిసి పట్టువస్ర్తాలు సమర్పించి తలంబ్రాలను అందజేశారు. అనంతరం సుప్రభాతసేవ, లలితాసహస్ర నామర్చాన, బాలభోగనివేదన తదితర పూజలు నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శన, జడకొప్పు, పోతురాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలిరావడంతో దర్వేశిపురం భక్తజన సంద్రంగా మారింది. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల ప్రారంభించారు. 6వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. నేడు దర్వేశిపురం-పర్వతగిరి గ్రామస్తులచే భోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సీఐ రవీందర్, ఎస్‌ఐ ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

మంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే
మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో ఆలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం మాట్లాడారు. భక్తుల పాలిట కొంగుబంగారం దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు అనిఅన్నారు. అంతకు ముందుకు ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, తహసీల్దార్ చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు వంగాల సహదేవరెడ్డి, బకరం వెంకన్న, అబ్బగోని రమేష్, ఐతగోని యాదయ్యగౌడ్, జోన్నలగడ్డ శేఖర్‌రెడ్డి, చెనగాని యాదగిరిగౌడ్, హనుమంతు, చెనగాని అంజమ్మరామచంద్రు, అల్గుబెల్లి నర్సిరెడ్డి, భుక్క అంజయ్య, జినుకుంట్ల అంజయ్య, బోయపల్లి జానయ్య, ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రావణకుమారాచార్యులు, సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య, చిలకరాజు లింగయ్య, ఉపేందర్‌రెడ్డి, యాదగిరి, జినుకుంట్ల నాగరాజు, ఉపేందర్, ఆంజనేయులు, లింగస్వామి పాలకమండలి సభ్యులు జంగమ్మ, గట్టిగుండ్ల గిరిప్రసాద్, జినుకుంట్ల రాంబాబు, జినుకుంట్ల నాగేష్‌గౌడ్, పున్నా జ్ఞానేశ్వరి, చేదేటి నారాయణరెడ్డి, కంచరకుంట్ల వెంకట్‌రెడ్డి, నీలకంఠం కృష్ణయ్య, బొమ్మగాని యాదగిరి, నకిరేకంటి చంద్రయ్య, కదిరే శంకర్, మొండికత్తి వెంకటేశ్, నక్కనబోయిన లచ్చయ్య, భక్తులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...