వేగ నియంత్రణ ఉంటేనే..


Wed,June 12, 2019 01:58 AM

-బడి బస్సుల ఫిట్‌నెస్‌పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-ప్రమాదాలను నివారించేందుకే స్పీడ్ గవర్నెన్స్ లింకు
-నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల పునప్రారంభం
-జిల్లాలోని 700బస్సుల్లో 300 బస్సులకే ఫిట్‌నెస్
-ప్రత్యేక బృందాలతో నేటి నుంచి రవాణ శాఖ డ్రైవ్
నల్లగొండ, నమస్తే తెలంగాణ: బడిబస్సులు భద్రంగా ఉంటేనే పిల్లలు జాగ్రత్తగా ఇంటి నుంచి స్కూల్‌కు ప్రయాణం చేస్తారు. లేదంటే ప్రమాదాల భారీన పడే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణ శాఖ అధికార యంత్రాంగం ప్రతిఏటా విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అం దజేస్తారు. బస్ ఫిట్‌గా ఉందా లేదా అని గమనించి దాని ప్రకారంగా ఈ సర్టిఫికెట్‌ను సంబంధిత బస్ యా జమాన్యానికి అందజేస్తుంది. అయితే ఈ ఏడాది ఫిట్‌నెస్‌తోపాటు స్పీడ్ గవర్నెన్స్ సైతం తప్పనిసరి చేసింది. 60కి.మీ. వేగం దాటకుండా వేగ నియంత్రణ చేపట్టే ఉద్దేశంలో భాగంగానే ఈ పరికరాన్ని బస్‌లకు బిగించే విధంగా చర్యలు చేపట్టింది. జిల్లాలో 700 బస్‌లుండగా ఇప్పటివరకు 400 బస్‌లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వగా మరో 300 బస్‌లకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది. తాజా నిబంధనల ప్రకారం అన్నింటికి వేగ నియంత్రణ తప్పనిసరైంది.

బడి బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి..
విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించడానికి వచ్చేటువం టి విద్యార్థిని, విద్యార్థులు ప్రమాదాలకు గురి కావద్దనే ఉద్దేశంతో వారి క్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి బడి బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ (వేగ నియంత్రణ) పద్ధతిని తప్పనిసరి చేసింది. విద్యాసంస్థలకు సంబంధించిన ప్రతి బస్సు 60 కి.మీ. దాటకుం డా వేగ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రతి ఏటా పాఠశాలలు ఆరంభమయ్యే సమయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లే రవాణ శాఖ నుంచి ఆయా వా హనాలకు సంబంధించిన యా జమాన్యంపొందితే సరిపోతుం ది. అయితే ఈ ఏడాది సైతం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నప్పటికీ దానికి సర్కార్ ఆ దేశాల మేరకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరైంది. వేగ నియంత్రణకు సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్‌ను సంబంధిత వాహనానికి బిగిస్తేనే ఈ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఫిట్‌నెస్ చేసిన బస్సులకు గవర్నెన్స్‌కు వారం గడువు...
జిల్లా వ్యాప్తంగా ఆయా విద్యాసంస్థలకు సంబంధించి 700 బస్సులు ఉన్నాయి. అందులో 400 బస్సులకు ఫిట్‌నెస్ ధ్రువీకరిస్తూ రవాణాశాఖ యంత్రాంగం ఇప్పటికే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ఆయా బస్సుల యాజమాన్యానికి అందజేసింది. అయితే తాజాగా ప్రభుత్వం అన్ని బస్సులకు స్పీడ్‌గవర్నెన్స్ నిబంధన విధించడం తో ఫిట్‌నెస్ చేసినటువంటి బస్సులకు వారం గడువు ఇచ్చారు. ఈనెల 19వ తేదీలోపు ఫిట్‌నెస్ పొందినటువంటి బస్సుల యాజమాన్యం మొత్తం స్పీడ్ గవర్నెన్స్ ను బిగించుకోవాలని సూచిస్తోంది. అదేవిధంగా ఇప్ప టివరకు ఫిట్‌నెస్ పొందనటువంటి 300 బస్‌లకు సం బంధించి ముందస్తుగా స్పీడ్ గవర్నెన్స్‌ను బిగిస్తేనే ఆ సర్టిఫికెట్‌ను ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర రవాణా యంత్రాంగం మంగళవారం దీనికి సంబంధించిన విధీవిధానాలను జిల్లా రవాణాశాఖ యం త్రాంగానికి సూచించడంతో చర్యలు చేపట్టారు.

నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్....
జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలకు సంబంధించిన బస్సుల ఫిట్‌నెస్, స్పీడ్ గవర్నెన్స్ నిబంధనలపై నేటి నుంచి జిల్లా రవాణాశాఖ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. జిల్లా వ్యాప్తంగా ఎంవీఐలు, ఏఎంవీఐల ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసి రెగ్యులర్‌గా ఈ డ్రైవ్ చేయనున్నారు. రెండు,మూడు మండలాలకు ఒక ఏఎంవీఐని కేటాయించి అన్ని విద్యాసంస్థల్లోకి వెళ్లి ఆయా బస్సుల ఫిట్‌నెస్‌ను పరీక్షించే విధంగా చర్యలు చేపట్టారు. ఫిట్‌నెస్ చేసుకోకుండా రోడ్డెక్కిన బస్సుల ను సీజ్ చేయనున్నారు. ఇక సీటింగ్ సామర్థ్యం మిం చి పిల్లలను బస్‌లో ఎక్కిస్తే అదనంగా ఎక్కించిన ఒక్కోక్కరికి రూ.200 జరిమానా విధించి బస్సును సీజ్ చేయనున్నారు. అంతేగాక ఐదేళ్ల హెవీలైసెన్స్ అనుభ వం కలిగిన వారిని, 60ఏళ్లలోపు వయస్సు కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించి ప్రతీ బస్సులోను అటెండర్‌ను అందుబాటులో ఉంచాలి. లేదంటే బస్సులను సీజ్ చేయనున్నారు.

స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి
బస్సులు రోడ్డెక్కాలంటే తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందడానికి ఈ ఏడాది స్పీడ్ గవర్నెన్స్‌ను ప్ర భుత్వం తప్పనిసరి చేసినందున ప్రతిఒక్కరూ వేగ నియంత్రణ చేపట్టాలి. 60కి.మీ. దాటి బస్సు వేగం గా వెళ్లడానికి అవకాశం లేదు. బడి పిల్లలకు ప్రమా దం జరిగితే డ్రైవర్లతోపాటు సంబంధిత విద్యా సం స్థల యాజమాన్యంపైన చర్యలు ఉంటాయి. నిబంధనలకనుగుణంగా బస్సులను అందుబాటులోకి ఉంచుకోవడంతోపాటు అర్హులైన డ్రైవర్లను నియమించి అటెండర్‌ను సైతం బస్సు లో ఉంచాలి.
-పి.వెంకటరెడ్డి, ఎంవీఐ, నల్లగొండ

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...