వానాకాలం సాగుకు రైతన్న సిద్ధం


Wed,June 12, 2019 01:55 AM

-దుక్కులు దున్ని విత్తేందుకు పొలాలు సిద్ధం చేస్తున్న రైతులు
-ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో సాగుపై ఆసక్తి
-ఈ సంవత్సరం సాగువిస్తీర్ణం మరింత పెరిగే అవకాశం
శాలిగౌరారం : మృగశిర కార్తె ప్రారంభం కావడం.. జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురియడంతో వానాకాలం సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు సాగు పనులు మొదలు పెట్టారు. రెండ్రోజుల కిత్రం మండలంలో కురిసిన భారీ వర్షానికి భూములు మెత్తబడ్డాయి. దీంతో రైతులు చెలకలను దున్నడం, పొలాన్ని ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తూ విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందిస్తుండగా వాటితో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులు గ్రామంలోని వడ్రంగి వారి సాయంతో నాగళ్లను తయారు చేయించుకుంటుండగా.. మరి కొందరు దున్నేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు రైతులు నారుమళ్లను సైతం సిద్ధం చేస్తున్నారు. మండలంలో గతేడాది 12120ఎకరాల్లో పత్తి, 20వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం మరింతగా పెరుగనుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...