సాగర్ నీటిమట్టం 508.50 అడుగులు


Wed,June 12, 2019 01:54 AM

నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్ధ్యం 590 అడుగులకు గానూ 508.50 అడుగుల వద్ద 129.1385 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు కొనసాగడం లేదు, నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కులు, డీటి గేట్సు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 810 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ డ్యాం ఎడమకాల్వ ద్వారా, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా, కుడికాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 806.90 అడుగుల వద్ద 32.5593 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...