విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి


Tue,June 11, 2019 02:33 AM

-ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాసరావు
నల్లగొండ క్రైం : వర్షాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ట్రాన్స్‌కో సమావేశ మందిరంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంకా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ లైన్లు, స్తంభాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. లూప్‌లైన్లు, లూజ్‌లైన్లు లేకుండా చూడాలన్నారు. గత నెల విద్యుత్ కనెక్షన్లు నూటికి నూరుశాతం వసూలయ్యాయని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి ఇచ్చిన లక్ష్యం పూర్తిచేయాలన్నారు. ఐపీడీఎస్, దీన్‌దయాల్, గ్రామజ్యోతి పథకాలకు గడువు ముగిసినందున వాటి విషయంలో పకడ్బందీగా అమలుచేయాలన్నారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిని గుర్తించి సాధ్యమైనంత మేరకు అధిక మొత్తంలో కేసులు నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు రాములు, మదన్‌మోహన్‌తో పాటు 3 జిల్లాల ఎస్‌ఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...