దవాఖానలో నీటి కొరత లేకుండా చూడాలి


Mon,May 27, 2019 02:56 AM

-కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ -జిల్లా కేంద్ర దవాఖాన తనిఖీ
-రోగుల సహాయకులకు షెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశం

నీలగిరి : జిల్లా కేంద్ర దవాఖానను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం సందర్శించారు. దవాఖానలో చిన్నారుల వార్డు, ప్రసూతివార్డు, ఎస్‌ఎన్‌యూవార్డులను సందర్శించి బాలింతలతో, గర్భిణులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం దవాఖాన ప్రాంగణం లో ఉన్న రోగుల బంధువులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను, వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు అందించేందుకు మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో మరో 4 కూలర్ల ద్వారా తాగునీరు అందించి ఇబ్బంది లేకుండా తగినచర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్ డా. టి. నర్సింగరావును ఆదేశించారు. దవాఖానలో ఫ్యాన్లు, కూలర్లు రిపేర్లు ఉంటే చేయించాలని అవసరమైతే అదనంగా ఫ్యాన్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు నిర్వహించుటకు అన్నిసదుపాయాలుకల్పించాలన్నారు.ఎంసీహెచ్ ఆవరణలో రోగుల సహాయకులకు షెడ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్లు దామెర యాదయ్య, హేమలత పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...