సాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,May 27, 2019 02:55 AM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాం తమైన నాగార్జునసాగర్‌కు ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీ పర్యాటకులు సందర్శించారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. నాగార్జునకొండలో బుద్ధుడి జీవిత గాథలకు సంబంధించిన శిల్పాలను పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియంను సందర్శించడానికి తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు. నాగార్జునకొండలో యజ్ఞశాల, ఎత్తైన బుద్ధుడి విగ్రహం, అశ్వవేదయాగశాల, ఇటుకలతో ఏర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు, అలనాటి నదీలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలు తెలుసుకున్నారు. శ్రీపర్వతారామం (బుద్ధవనం)లోని గోపు రం పైన, మ్యూజియంలో అ మర్చిన శిల్పాలు, స్తూపపా ర్కు, ధ్యానవనం, బుద్ధ్దచరితవనం, మహాస్తూపపా ర్కు ప్రాంతాలలో పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం నాగార్జునకొండకు శని,ఆది వారం లాంచీలు నడపడంతో రూ.30, 000 ఆదాయం వచ్చిందని లాంచీ స్టేషన్ మేనేజర్ గంగరామ్ తెలిపారు. విహారయాత్రలకు వచ్చే విద్యార్థులు, పర్యాటకులు, విదేశీయులతో సాగర్ పర్యాటక ప్రాంతాలైన లాంచీ స్టేషన్, బుద్ధ్దవనం, దయ్యాలగండి, డ్యాం పరిసర ప్రాంతాలు విద్యార్థులు, పర్యాటకులతో కిటకిట లాడాయి.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...