అడుగంటుతున్న శాలిగౌరారం ప్రాజెక్టు


Mon,May 27, 2019 02:55 AM

-ప్రస్తుతం 10అడుగుల నీరే...
-ఆందోళనలో ఆయకట్టు రైతులు
శాలిగౌరారం : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులో ఒక్కటైన శాలిగౌరారం ప్రాజెక్టులో కేవలం 10అడుగుల నీరు మాత్రమే ఉంది. గతేడాది మే నెలలో ఇప్పటి వరకు 15అడుగుల నీరు వచ్చి చేరింది. ఈఏడాది నేటికి ప్రాజెక్టులోకి అనుకున్న మేర నీరు చేరక పోవడంతో వచ్చే వానాకాలం పంటకు నీరు అందుతాయో లేదోనన్న ఆందోళన ఆయకట్టు రైతుల్లో మొదలైంది. దేవుడు కురుణిస్తే గాని ప్రాజెక్టులోకి నీరు చేరే పరిస్థితి లేదు. గతేడాది వరుణ దేవుడు ముందస్తుగా కరుణించడంతో వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరందింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందంగా పంటను సాగు చేసుకున్నారు.

- 21అడుగుల సామర్ధ్యం
నిజాం నవాబుల కాలంలో ముందు చూపుతో నిర్మించిన శాలిగౌరారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21అడుగులు. దీనికి కుడి, ఎడుమ కాల్వలను ఏర్పాటు చేసి ఒక్కో కాల్వ కింద 2వేల ఎకరాల భూములు సస్యశ్యామలం అయ్యే విధంగా ఆనాడే ప్రణాళికను రూపొందించారు. అప్పటి నుంచి నేటి వరకు కాల క్రమేణ భూవిస్తీర్ణం, ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం పెరిగి మొత్తంగా ఆయకట్టు కింద 6వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. శాలిగౌరారం, శాలిలింగోటం, రామగిరి, పావురాలగూడెం, అంబారిపేట శివారు, గురజాల, ఊట్కూరు, అడ్లూరు గ్రామశివారు భూములకు నీరు అందుతుంది.

-పల్లివాడ హెడ్ వర్క్ నుంచి..
రామన్నపేట మండలం పల్లివాడ హెడ్ వర్క్ వద్ద మూసీ నదికి అడ్డుకట్ట వేయడంతో అక్కడి నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రయాణ మార్గంలోని పదుల సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలను నింపుకుంటూ ప్రాజెక్టులో కలుస్తాయి. గడిచిన యాసంగి పంటకు సాగు నీరందించిన నేపథ్యంలో ప్రాజెక్టులో నీరు అట్టడుగు స్థానానికి పడి పోయింది. గత నెలలో కురిసిన అకాల వర్షంతో మూసీ ప్రవహించడంతో ప్రాజెక్టులోకి రాచకాల్వ ద్వారా నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతానికి 10అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...