కట్టంగూర్‌లో ఆంత్రాక్స్ కలకలం..


Mon,May 27, 2019 02:55 AM

-అప్రమత్తమైన అధికారులు
-గ్రామాల్లో పశువైద్య శిబిరాలు

కట్టంగూర్ : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండంలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన సుంకరబోయిన సైదులుకు చెందిన రెండు గొర్రెలు వింత వ్యాధితో ఈ నెల 22న మృతి చెందాయి. చనిపోయిన గొర్రెల మలవిసర్జన చేసే ప్రాంతంతోపాటు నోటి నుంచి తీవ్ర రక్తం రావడంతో సైదులు వైద్యాధికారి బిక్యానాయక్‌కు చూపించగా ఆంత్రాక్స్ లక్షణాలున్నట్లు వైద్యాధికారి నల్లగొండ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేశారు. గొర్రెకు దొమ్మ రోగంతో మృతి చెందినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధి ప్రభలకుండా తగిన చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పశు సంవర్థకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కట్టంగూర్ పశువైద్యాధికారి ఆదివారం మండల కేంద్రాలోని వైద్యశిబిరం ఏర్పాటు చేసి గొర్రెలు, మేకలు, పశువులకు ఆంత్రాక్స్ నివారణ టీకాలు వేశారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని గొర్రెలకు సోకుతుందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలో గొర్రెలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. మూగజీవాలు శ్వాస పీల్చుకోనేందుకు ఇబ్బంది, కడుపునొప్పి, చనిపోయిన గొర్రెలకు నోటి, మలవిసర్జన ప్రాంత నుంచి రక్తం రావడం వ్యాధి లక్షణాలుగా గుర్తించొచ్చన్నారు. ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన మూగజీవాల మాంసం తినడం, వాటి గాలిని పీల్చడం వల్ల ప్రజలకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లా అధికారులు అప్రమత్తమై ఆంత్రాక్స్ వ్యాధి ఇతర ప్రాంతాలకు సోకుండా ప్రాథమిక దశలోనే నివారించేందుకు తగిన చర్యలు చేపట్టారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...