రిజిస్ట్రేషన్ నగదు రహితం


Sun,May 26, 2019 03:48 AM

-సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు సన్నాహాలు
-జూన్ 1 నుంచి నగదు రహిత సేవలు
-పారదర్శకత కోసమే ఆన్‌లైన్ విధానం
-అక్రమాలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
-అందుబాటులో తెలంగాణ వ్యాలెట్ యాప్

నీలగిరి

రిజిస్ట్రేషన్ సేవలు ఇక నగదు రహితం కానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతమొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలను నగదు రహితంగా నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ వ్యాలెట్ యాప్‌ను రూపొందించింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం ప్రారంభం కానుంది. కార్యాలయంలో ఆన్‌లైన్ విధానం అమలుతో ఆయా సేవలకుగానూ ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేయడం ఇక సాధ్యం కాదు.

నీలగిరి:అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి పలు ప్రభుత్వ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పారదర్శక పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2016లో మున్సిపల్ శాఖలో ఇంటి యాజమాని పేర్పు మార్పు, ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్ను వసూలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విధానం రెవెన్యూ శాఖలో కుల, ఆదాయ స్థానిక తదితర ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రత్యేక యాప్‌లలో ఆప్‌లోడ్ చేసి సులువైన పద్ధతిలో పత్రాలు పొందేలా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. విధానంలో ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అవినీతి పాలనే లక్ష్యంగా కాగిత రహితం, నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుంది.

దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగాల్లో జవాబుదారితనం పెంచి అవినీతికి ఆస్కారం లేకుండా చేసింది. ఇందులో భాగంగానే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రుసుముల స్వీకరణకు తెలంగాణ వ్యాలెట్ యాప్‌ను తీసుకొచ్చిన సర్కారు జూన్ 1నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించనుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివిధ సేవలకు వసూలు చేసే ఆదనపు మొత్తం (అధిక వసూలు) లేకుండా ప్రభుత్వం నిర్ధేశించిన రుసుమును మాత్రమే తీసుకుని సేవలు అందించే విధంగా ఈ అన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రజలకు విస్తతమైన సేవలు సత్వ రం అందే అవకాశం ఉంది.

యాప్‌తో ప్రయోజనాలు...

బాండ్ పేపర్లను కొనుగోలు చేసేందుకు నగదుకు బదులు తెలంగాణ వ్యాలెట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ నగదు చెల్లించి, ఎస్‌ఎంఎస్‌ను సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ(ఎస్‌ఆర్‌ఓ) సిబ్బందికి చూపించి బాండ్ పేపర్లను పొందవచ్చు. బాండ్ పేపర్లును పొందాలంటే పేపర్ల రుసుముతోపాటు కార్యాలయ సిబ్బందితోపాటు కార్యాలయ సిబ్బంది కొంత అధికంగా వసూలు చేసేవారు. ఇక నుంచి ఈ విధానాన్ని తెలంగాణ వ్యాలెట్ యాప్ ద్వారా అరికట్టవచ్చు. ఉదాహరణకు రూ.20, రూ.50,రూ.100 బాండ్ పేపర్ల రుసుం కంటే అదనంగా రూ.20 వసూలు చేసేవారు దీన్ని అరికట్టవచ్చు. భూములను సంబంధించిన వివరాలను ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)లు పొందాలంటే ఈ యాప్ ద్వారా నగదు చెల్లించి ఈసీలను పొందవచ్చు. 30 ఏళ్లలోపు ఈసీలు పొందాలంటే రూ.200, అపైన ఈసీలు పొందాలంటే రూ.500చెల్లించాలి. వీటికి కార్యాలయం నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ద్వారా నగదును చెల్లిస్తే 30రోజుల లోపు ఈసీలను పొందవచ్చు.

సర్టిఫైడ్ కాపీలు పొందాలంటే...

సర్టిఫైడ్ కాపీలను పొందాలంటే మ్యాన్‌వల్ అయితే రూ.200, కంప్యూటరైజ్‌డ్ కాపీలను రూ.270లు ఈ యాప్ ద్వారా చెల్లిస్తే కాపీలను పొందవచ్చు. 2001 కంటే ముందు మ్యాన్‌వల్ కాపీలను మూడు రోజుల్లో , 2002 సంవత్సరం తరువాత కాపీలైతే ఒక రోజులో పొందవచ్చు. హిందు వివాహ నమోదు పత్రం(మ్యారేజ్ సర్టిఫికెట్) రూ. 200 చెల్లించాలి. ఈ తెలంగాణ వ్యాలెట్‌యాప్ ద్వారా నగదు చెల్లించి రిజిస్టర్ సర్టిఫికెట్ పొందవచ్చు. 2017 ఏఫ్రిల్ నుంచి ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి రిజిస్టర్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో చలానా చెల్లించడం ద్వారా కార్యాలంలో నగదు మార్పిడిని, అవినీతి అక్రమాలు, లంచాలు అరికట్టవచ్చనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...