కల్లేపల్లి బంగారు మైసమ్మ


Sun,May 26, 2019 03:46 AM

-ఆలయ కార్యనిర్వహణాధికారిగా జయరామయ్య బాధ్యతలు
దామరచర్ల : మండలంలోని కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. గత కొన్ని ఏండ్లుగా ఆలయ నిర్వాహణను పూజార్లు పర్యవేక్షిస్తున్నారు. గతంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయం నిర్వాహణ బాధ్యతలు మూడేళ్ల పాటు నిర్వహించుకునేలా దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇచ్చిన గడువు ముగియడంతో ఎండోమెంటు కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి ఆలయ నిర్వాహణ బాధ్యతలను తీసుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే ఈ ఆలయంపై గత కొన్ని ఏండ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నెలకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. దీనితోపాటుగా రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే జాతరకు కూడా ముందుగానే రూ.లక్షల్లో వేలం పాట పాడి రెండేళ్ల పాటు నిర్వాహణ బాధ్యతలు చేపడ్తారు. గడువు ముగియడంతో గ్రామస్తులు చేసిన వినతి మేరకు తిరిగి శనివారం దేవాదాయ శాఖ బాధ్యతలను తీసుకుంది. అసిస్టెంటు కమిషనర్ ఏ.చంద్రశేఖర్, వాడపల్లి ఎస్‌ఐ నర్సింహారావు, సూపరింటెండెంట్ రఘునాథ్, ఇన్‌స్పెక్టర్ రమేష్ సమక్షంలో ఆలయ కార్యనిర్వాహణాధికారిగా జయరామయ్య బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కుశలయ్య, గ్రామ సర్పంచ్ జనార్దన్, శివకుమార్, పాచ్యూనాయక్, నెహ్రూనాయక్, ఎర్రానాయక్, లింగానాయక్ ఉన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...