పశుగణన సర్వే పూర్తి


Sun,May 26, 2019 03:45 AM

- భారీగా పెరిగిన గొర్కెలు, మేకలు
- 2012లో వీటి సంఖ్య 7,14,616.. నేడు 28,14,838..
-77మంది ఎన్యూమరేటర్లు, 15మంది సూపర్‌వైజర్ల సాయంతో లెక్కింపు
- పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

జిల్లావ్యాప్తంగా పశువుల సంఖ్య తేల్చేందుకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన పశుగణన సర్వే పూర్తి అయ్యింది. ప్రతి ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే సర్వేలో సుమారు 12రకాల పశువులకు సంబంధించిన సమాచార సేకరణను ఎన్యుమరేటర్లు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సేకరించారు. 2012లో జరిగిన సర్వేలో గొర్రెలు, మేకల సంఖ్య 7,14,616ఉండగా నేడు వీటి సంఖ్య గణనీయంగా పెరిగి 28,14,838కి చేరింది. కానీ పశువుల సంఖ్య మాత్రం కొంత మేర తగ్గింది. 77మంది ఎన్యూమరేటర్లు, 15మంది సూపర్‌వైజర్ల సాయంతో పూర్తి చేసిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
-సూర్యాపేట వ్యవసాయం

సూర్యాపేట వ్యవసాయం : జిల్లాలో పశువుల సంఖ్యను అంచనా వేసేందుకు అధికారులు ప్రారంభించిన సర్వే పూర్తి అయ్యింది. ఐదేండ్లకు ఒకసారి పశువుల సంఖ్యను తేల్చేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వే సుమారు 12 రకాల పశువులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్యూమరేటర్లు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సేకరించారు. 2012లో జరిగిన సర్వేలో గొర్రెలు, మేకల సంఖ్య 7,14,616 ఉండగా నేడు ఆ సంఖ్య భారీస్థాయిలో పెరిగి 28,14,838కి చేరింది. 1,09,976గా ఉన్న పశువుల సంఖ్య 1,03,616కు తగ్గింది. పశువులు మినహా అన్నిరకాల జంతువుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సర్వే వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

-గత అక్టోబర్‌లో ప్రారంభం...
గత ఏడాది అక్టోబర్‌లో ప్రాంభమైన పశుగణన సర్వేలో 77మంది ఎన్యుమరేటర్లు, 15మంది సూపర్‌వైజర్ల సాయంతో జిల్లాలోని 23 మండలాల్లో పూర్తి చేశారు. 2012లోమేకలు, గొర్రెలు, బర్రెలు, పందులు, కుక్కలు, టర్కీకోళ్లు, బాతులు గత సంఖ్యతో పోలిస్తే ఈసారి వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది.

-ఆన్‌లైన్ లో వివరాల నమోదు
ఈసారి జిల్లాలో చేపట్టిన పశువుల సంఖ్య సేకరణ ద్వారా సేకరించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గతంలో చేపట్టిన సర్వేలు మొత్తం మాన్యువల్‌గానే చేపట్టగా ఈసారి మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. ఈ సర్వే చేసేందుకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేశారు. సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో రైతుల ఆధార్ నెంబర్, రైతుకు ఎన్నిరకాల పశువులు ఉన్నాయన్న వివరాలతోపాటు రైతుల ఫొటోలను జియోట్యాగింగ్ ద్వారా సేకరించారు.

-పశుసంపద వృద్ధి
జిల్లాలో గతంలో 2012లో పశుగణన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత చేపట్టిన మొట్టమొదటి పశుగణన ద్వారా పశుసంపద వృద్ధి చెందింది. కానీ ఆవులు, ఎద్దులు మాత్రం గతంతో పోలిస్తే కొంత తగ్గింది. 2012లో జరిగిన సర్వేలో గొర్రెల సంఖ్య 5,94,122 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య పెరిగి 8,21,941కి పెరిగింది. అదే విధంగా గతంలో 1,20,494గా ఉన్న మేకల సంఖ్య భారీస్థాయిలో పెరిగి 19,92,897కు చేరింది. ఇతర జంతువులైన కోళ్లు, కుక్కలు, బాతులు, పందులు, కుందేళ్లు, సీమకోళ్ల సంఖ్య కూడా గతంలో కంటే పెరిగింది.

-21లక్షలకు చేరిన గొర్రెలు, మేకలు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం ద్వారా జిల్లాలో వాటి సంఖ్య 21లక్షలకు చేరింది. 2012లో ఉన్న గొర్రెలు మేకల సంఖ్య 7,14,616 ఉండగా నేడు వాటి సంఖ్య 28,14,838కు చేరింది.

జిల్లాలో పశువుల లెక్క ఇలా...
రకం 2012 2019
సర్వే చేసిన కుటుంబాలు 2,85,690 3,01,977
1. ఆవులు, ఎద్దులు 1,09,976 1,03,616
2. బర్రెలు 2,15,480 3,18,634
3. గొర్రెలు 5,94,122 8,21,941
4. మేకలు 1,20,494 19,92,897
5. కోళ్లు సమాచారం లేదు 1,45,252
6. పందులు లేదు 2,640
7. కుక్కలు లేదు 7,687
8. బాతులు --- 7,908
9. కుందేళ్లు --- 364
10. సీమకోళ్లు --- 207
11. గాడిదలు --- 39
12. గుర్రాలు --- 9

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...