కనుల పండువగా లక్ష్మీనృసింహుని నిత్యకల్యాణం


Sun,May 26, 2019 03:43 AM

మఠంపల్లి : పవిత్ర మట్టపల్లి శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనృసింహ స్వామి వారి నిత్యకల్యాణోత్సవం దేవాలయ అర్చకులచే శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈసందర్బంగా శ్రీ లక్ష్మీనృసింహస్వామి అమ్మవార్లకు నిత్య కల్యాణోత్సవంలలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్య ప్రాసన నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ తలంబ్రాలతో నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి తీర ్ధప్రసాదాలు వినియోగం చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్, కార్యనిర్వాహణాదికారి ఉదయభాస్కర్, దేవాలయ అర్చకులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...