ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : చంద్రశేఖర్


Sun,May 26, 2019 03:42 AM

నీలగిరి: నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం తన చాంబర్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థ్ధులు, ఏజెంట్లు, రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు గుర్తింపు కార్డులు జారీ చేస్తారని తెలిపారు. ఈనెల 31న ఉమ్మడి జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో 7 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1086మంది ఓటర్లు ఉన్నారని అందులో 811 మంది ఎంపీటీసీలు, 57 మంది జడ్పీటీసీలు, 208 మంది కౌన్సిలర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 1114 ఓటర్లకు గాను 28 మంది సభ్యులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...