నిప్పుల కొలిమి


Sat,May 25, 2019 02:33 AM

- ఉగ్రరూపం దాల్చుతున్న భానుడు
- రోజురోజుకు పెరుగుతున్న ఎండతీవ్రత
- 43డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రత
-గత ఏడాది కంటే 3డిగ్రీలు పైనే..
- కర్ఫూని తలపిస్తున్న రహదారులు
నల్లగొండ, నమస్తే తెలంగాణ: వర్షకాలం ఆరంభమయ్యే రోజులు... అయినా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించడం లేదు. ఈ మాసాంతం 40 డిగ్రీలకుపైగా నమోదవుతూ 45 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా హెచ్చు తగ్గులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు విలవిల లాడుతున్నారు. జూన్ నెల సమీపిస్తున్నప్పటికి 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో బయట ప్రపం చం నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. శుక్రవారం సైతం గరిష్ట ఉష్ణోగ్రత 43.8 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు నమోదైంది.

43 డిగ్రీలకు పైగా...
ఈఏడాది వేసవి ఆరంభం నుంచే మొదలైనటువంటి భానుడి భగభగలు ఇప్పటికి తగ్గే పరిస్థితి లేదు. మార్చి నుంచే 40 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రత ఏప్రిల్, మే నెలల్లో 42,43 డిగ్రీలు నమోదవుతూ ఇటీవల 45 డిగ్రీలు దాటింది. వర్షాకాలం ఆరంభమయ్యే మాసం సమీపించినప్పటికి గరిష్ట , కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించకపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గడిచిన వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగానే నమోదవుతుంది.

గతేడాది కంటే 3 డిగ్రీలకు పైగా...
గతేడాది ఫిబ్రవరి మాసం నుంచి మే వరకు పరిశీలించి ఈ ఏడాదితో పోల్చితే ప్రతి నెలలోనూ 2 నుంచి 3 డిగ్రీలు ఈ ఏడాది ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరం మే 18న గరిష్ట ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు న మోదు కాగా, కనిష్ట ఉ ష్ణోగ్రత 28.4 డిగ్రీలు నమోదైంది. అయి తే ఈ ఏడాది అదే రోజున 43.4 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే 24.0 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించినప్పటికి గరిష్ట ఉష్ణోగ్రత 3.2 డిగ్రీలు నమోదవడంతో ఎండ తీవ్రమైంది. అదే విధంగా గత సం. పిబ్రవరి 24న గరిష్ట ఉష్ణోగ్రత 40.4, క నిష్ట ఉష్ణోగ్రత 26.4 నమోదు కాగా ఈ ఏ డాది అదే రోజున గరిష్ట ఉష్ణోగ్రత 43.8, కనిష్ట ఉష్ణోగ్ర త 24.6 డిగ్రీలు న మోదైంది. అంటే గరి ష్ట ఉష్ణోగ్రత 3.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 1.8డిగ్రీలు అత్యధికంగా నమోదైంది. 18 నుంచి 24 వరకు వారం రోజులు పరిశీలిస్తే ప్రతి రోజు 3 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...