యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌సేవ


Sat,May 25, 2019 02:30 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌సేవను కోలాహలం గా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళాభక్తులు పాల్గొనే ఊంజల్ సేవలో వేలాదిమంది భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త...తనను కొలిచిన వారికి నేనున్నానంటు అభయహస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 516 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపా రు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటి తో అర్చన జరిపారు. ఉపప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృం దం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాట లు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటల తో అమ్మవారిని కొనియాడుతు లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్జిత పూజల కోలాహలం ...
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ ఎమూర్తులకు అభిషేకం జరిపారు. ఉద యం మూడుగంటలకు సుప్రభాతం నిర్వహించి న అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించి న శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ.13, 28, 251 ఆదా యం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ రూ.98,394, ప్రసాదవిక్రయాలతో రూ.4,42,615, వత్రపూజలతో రూ. 85, 000, 100 రూపాయల టిక్కెట్ దర్శనంతో రూ. 89,400, ఇతరములతో రూ.4,75,741 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...