వైభవంగా లక్ష్మీనృసింహుడి నిత్య కల్యాణం


Sat,May 25, 2019 02:30 AM

మఠంపల్లి: కృష్ణానది తీరాన వేంచేసియున్న లక్ష్మీనృసింహస్వామి వా రి నిత్యకల్యాణోత్సవం దేవాలయ అర్చకులచే శుక్రవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనృసింహస్వామి అమ్మవార్లకు నిత్య కల్యాణోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్య ప్రాసన నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ తలంబ్రాలతో నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి తీర్ధప్రసాదాలు వినియోగం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి తిరుకల్యాణోత్సవం సందర్భంగా నిలిచిపోయిన ప్రత్యేక పూజలు, నిత్యకల్యాణోత్సవం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. కా ర్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చె న్నూరి విజయ్‌కుమార్, కార్యనిర్వాహణాధికారి ఉదయభాస్కర్, దేవాలయ అర్చకులు ఫణిగిరి మంగాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...