27న ఎంజీయూ డిగ్రీ పరీక్షలు యధాతథం


Sat,May 25, 2019 02:30 AM

ఎంజీయూనివర్సిటీ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 27న నిర్వహించనున్న యూజీ (డిగ్రీ) సెమిస్టర్, వార్షిక పరీక్షలు యధాతథంగా ఉంటాయని ఎంజీయూ సీఓఈ డా. మిర్యాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ నెల 27న జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడినందున పరీక్షలు ముందుగా సూచించిన విధంగానే ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు గమనించి పరీక్షలకు హాజరు కావాలని కోరారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ కళాశాలల పరిధిలోని విద్యార్థులకు విషయాన్ని తెలియజేయాలన్నారు. అదే విధంగా ఈ నెల 27న జరిగే పీజీ అన్ని కోర్సుల పరీక్షలను గతంలో 29కి వాయిదా వేశామని, అయితే ఇవి వాయిదా వేసిన తేదీకే జరుగుతాయని సూచించారు. వీటిలో మార్పు లేదన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...