కిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు


Thu,May 23, 2019 01:31 AM

నల్లగొండక్రైం : జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు కేసులు పెట్టడంతో పాటు అలాంటి వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకొని రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడకుండా వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా కృషి చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్య వసాయ శాఖ, పోలీస్ అధికారులు జిల్లాలోని ఎరువుల దుకాణదారులతో నిర్ణయించిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. నకిలీ నివారణ కోసం సీఎం కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల దుకాణదారులు, డీలర్లు రైతులకు నష్టం లేకుండా సహకరించాలన్నారు. ఈవిషయంలో రైతులను చైతన్యం చేయడమే లక్ష్యంగా పోలీస్‌ల ఆధ్వర్యం లో చర్యలు చేపడుతున్నామన్నారు.

విత్తనాల నాణ్యతపై వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తనిఖీలు చేస్తామన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల ప్రభావం లేకుండా చూస్తామని చెప్పారు. ఎరువుల డీలర్లు, దుకాణదారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలన్నారు. లైసెన్స్‌లేకుండా, అనుమతి లేని విత్తనాల విక్రయాలు, ప్యాకింగ్ లేబుల్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పోస్టర్లు ముద్రించి రైతులను చైతన్యం చేస్తామన్నారు. డీఏఓ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

వ్యవసాయానికి సంబంధించి ఇతర జిల్లాల వ్యవసాయాధికారులతో టీమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు టాస్క్‌పోర్సు బృందాలు తనిఖీ చేయిస్తామన్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు నుంచి వస్తున్న డీజీ3 విత్తనాలు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. దుకాణదారులు వీటిని విక్రయించవద్దని కోరారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా విత్తనాలు జిల్లాకు రాకుం డా చేయాలని పోలీసులను కోరారు. సమావేశంలో ఇన్‌చార్జి ఏఎస్పీ రమేష్, డీఎస్పీలు గంగారామ్, మహేశ్వర్, శ్రీనివాస్, శివరాంరెడ్డి, రమణారెడ్డి, నర్సింహాచారి, ప్రతాప్, ఏకోనారాయణ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...