టీఆర్‌ఎస్‌కు 16ఎంపీ సీట్లు ఖాయం


Thu,May 23, 2019 01:30 AM

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీలక్ష్మీనరసింహుని దీవెనలతో టీఆర్‌ఎస్ 16ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేడు వెలువడే ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పదహారు సీట్లు గెలిచేలా ఆశీస్సులు ఇవ్వమని శ్రీలక్ష్మీనరసింహునికి పూజలు చేసేందుకు యాదాద్రి వచ్చినట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ చేస్తున్న పుణ్యఫలం తెలంగాణ ప్రజలకు దక్కుతుందని చెప్పారు. కేసీఆర్ చరితార్థులే కాదు.. కారణజన్ములని ప్రశంసించారు. ఒక వైపు కాళేశ్వరంతో లక్షలాది ఎకరాల బీడు భూములను సాగు చేసే యజ్ఞం చేపట్టిన కేసీఆర్, మరో వైపు ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టి సమాజ కల్యాణానానికి పూనుకున్నారని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్‌ను కారణజన్మునిగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చారిత్రాత్మకమని, ఆధ్యాత్మిక సమాజానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవ ఆచంద్ర తారార్కం నిలిచిపోతుందన్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...