వైభవంగా నృసింహుడి వసంత సేవ


Tue,May 21, 2019 01:33 AM

మఠంపల్లి : సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న నృసింహుడి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఐదో రోజు సోమవారం వసంత సేవను వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాలతో అభిషేకం, అర్చనలు ఆచరించి, పుష్పాలంకరణ చేశారు. అనంతరం హోమగుండం వద్ద ప్రాతఃకాల, అస్త, నృసింహ హోమాలను సుదర్శన అల్వార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్షేరాధన, పుణ్యాహవాచనం గావించి పవిత్ర జలాలతో ఆలయాన్ని సంప్రోక్షించి, సప్తరుషి పూజ చేశారు. స్వామివార్లకు కృష్ణానదిలో పంచామృతాలతో అభిషేకం చేసి తదుపరి చక్రస్నానం గావించారు. అనంతరం నవకుంభాలతో ధ్వజస్తంభం, స్వామివారి వామనశికరం, అభిషేకం, దోపోత్సవం నిర్వహించి మంగళవాయిద్యాలతో స్వామి వారి చరిత్ర, బలినిర్వాహణ, ధ్వజారోహణ గావించారు.
నేడు శృంగార డోలోత్సవం ... శ్రీ లక్ష్మీనృసింహ తిరుకల్యాణోత్సవంలో భాగంగా నేడు శృంగార డోలోత్సవం, రాత్రి పవళిం పు సేవ, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూ రి విజయ్‌కుమార్‌, ఈఓ ఉదయభాస్కర్‌, ఆలయ అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...