అన్నదాతకు ఆసరా


Mon,May 20, 2019 03:49 AM

-రైతుబంధుతో అందుతున్న పెట్టుబడి సాయం
-జిల్లాలో గతేడాది 4.41 లక్షల మందికి లబ్ధి
-ఎకరాకు రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచిన ప్రభుత్వం
-వానాకాలం పెట్టుబడి సాయానికి సన్నద్ధం
అన్నదాతలను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన రైతుబంధు పథకం ప్రారంభించి ఏడాది అయ్యింది. గతేడాది వానాకాలం ఈ పథకాన్ని ప్రారంభించారు. మళ్లీ వానాకాలం రానుండటంతో పెట్టుబడి సాయాన్ని అందించటానికి జిల్లా వ్యవసాయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువు లు, కొనుగోలు సాగు ఖర్చుల కోసం సమయానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడిసా యం జమ చేయడానికి సన్నద్ధ్దం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరా ఇస్తుంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంలా మారింది. ఈ పథకంతో ప్రతి రైతుకూ రెండు కార్లకు ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయం అందటంతో పంటల సాగుకోసం అప్పులు చేసే తిప్పలు తప్పినయని రైతుల్లో అనందం వ్యక్తం అవుతుంది. పెట్టుబడి సాయాన్ని మరో రూ.2వేలు పెంచి 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి రెండు కార్లకు కలిపి ఎకరాకు రూ.10 వేలు చొప్పున అందిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో రాబోయే వానాకాలం నుంచి పెట్టుబడి సాయం పెరగనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి వానాకాలం రూ.5వేలు, యాసంగి రూ.5వేలు చొప్పు న రైతులకు పంటల పెట్టుబడి సాయం అందనుంది.

రైతులు పొలాల్లో పంటల సాగుకోసం పెట్టుబడి పెట్టడానికి బ్యాంకుల్లో పంట రుణాలు పొందేవారు. రైతుల బాధలు తొలగించడానికి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేయడం వల్ల రైతులకు ఈ బాధలు అన్ని తొలగిపోయాయి. ప్రతి సీజనుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించడం వల్ల వ్యవసాయానికి భరోసా కలిగింది. కాగా ఎన్నికల కోడ్ ముగియగానే జూన్ మొదటివారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

దేశానికే ఆదర్శంగా రైతుబంధు....
రైతుల కష్టాలను దగ్గరుండి చూసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పేరు ను మార్చి జాతీయస్థాయిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ పనితీరుకు ఇదే నిదర్శనమని దేశమంతా ప్రశంసలు కురింపించారు.

గతేడాది 4లక్షల 41 వేల 838 మందికి లబ్ధి
గతేడాది జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా వానాకాలం పెట్టుబడి కింద 4 లక్షల 41 వేల 838 మంది రైతులకు రూ. 470,37,23,820 పంట పెట్టుబడి అందింది. అదేవిధంగా యాసంగి పంటల పెట్టుబడి సాయం 3,60,827 మంది రైతులకు రూ.420,94,69,350 అందించారు. కాగా యాసంగి పంటలకు ఇచ్చిన సాయం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేరుగా రైతు ఎకౌంటులోకి మార్చాలని నిబంధన ఉండటంతో సాంకేతిక కారణాలతో మరో 44,804 మం ది రైతులకు యాసంగి రైతుబంధు చెక్కులు అందలేదు. ఈ రైతులకు త్వరలో చెక్కులు అందించనున్నారు.

పెరుగనున్న పెట్టుబడి సాయం
వచ్చే వానాకాలం సీజను నుంచి పెట్టుబడి సాయం ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి సాయం మరింత పెరగనుంది. రైతుల ఏటా పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వడ్డీ అసలు పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతు ల కష్టాలు పూర్తి తొలగిపోయాయి. వానాకాలం రైతుల అకౌంటులోకి నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...