ఫణిగిరి ఎంతో సుందరమైన బౌద్ధ క్షేత్రం


Sun,May 19, 2019 01:03 AM

తిరుమలగిరి నమస్తేతెలంగాణ : ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఎంతో సుందరమైందని, బుద్ధుడి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ బయల్పడ్డాయని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, సాలార్‌జంగ్ య్యూజియం సలహాదారులుడు కుర్రా జితేంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో శనివారం ఫణిగిరి బౌద్ధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుద్ధుడి 2,563వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీ.శ 1,2వ శతాబ్దంలోనే ఈ ప్రాంతం గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయంగా విలసిల్లిందని అన్నారు. బుద్ధుడి చారిత్రక అవశేషాలు ఇంకా ఎన్నో ఇక్కడ ఉన్నాయని అన్నారు. వాటిని వెలికితీసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇక్కడ బయల్పడుతున్న సంపదను ఈ ప్రాంతంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో ఈ ప్రాంతం గొప్ప పర్యాటక కేంద్రంగా మారి మంచి ఆదాయం వస్తుందని అన్నారు. ఈ ఆదాయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణకు తలమానికంగా మారనుందని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, బౌద్ధ భిక్షువులు ఫణిగిరి గుట్టపై ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. గుట్టపై బుద్ధుడి జయంతి సందర్భంగా ధ్యానం చేశారు. కార్యక్రమంలో బౌద్ధ భిక్షువు నాగార్జున బోధి, ఫణిగిరి బౌద్ధ ఉత్సవ కమిటీ కన్వీనర్ పంది రవికుమార్, అడ్వకేట్ కృష్ణారెడ్డి, గుంటకండ్ల అశోక్‌రెడ్డి, సర్పంచ్ గట్టు నర్సింహారావు, ఎర్ర యాదగిరి, వేముల శేఖర్, దమ్మచారి, విష్ణువర్ధన్, గట్టు వీరయ్య, సోమరాపు యాకయ్య, చిలుకూరి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...