ఎంపీ కౌంటింగ్ సజావుగా నిర్వహించాలి


Sun,May 19, 2019 01:02 AM

నీలగిరి: ఈ నెల 23న నిర్వహిస్తున్న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కౌంటింగ్ ప్రక్రియపై నియమించిన 140 మంది సూక్ష్మ పరిశీలకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు పరిశీలిస్తారని, వారి తరుపున సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన బ్యాంక్, ఎల్‌ఐసీ, ఇతర ఉద్యోగులు కౌంటింగ్ రోజున బాద్యతయుతంగా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాద్, సూర్యాపేట ఎల్‌డీఎం సూర్యాం జేడీఏ శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...