27న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి


Sat,May 18, 2019 02:00 AM

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
నీలగిరి : ఈ నెల 27న జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ల నియామకం పూర్తి చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేసి నిరంతరవిద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్‌కు సరిపడా టేబుళ్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సజావుగా, నిషక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఎంపీటీసీకి రెండు టేబుళ్లు ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సుల నుంచి పేపర్లు జాగ్రత్తగా వేరు చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్ట కట్టి డ్రమ్ములో వేసిన తర్వాత ఒక్కో టేబుల్‌పై వెయ్యి చొప్పున లెక్కింపు చేయాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. 26 లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని 27న సకాలంలో కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...