యాదాద్రిలో వైభవంగా శ్రీనృసింహ జయంతి


Sat,May 18, 2019 01:59 AM

- సహస్ర ఘటాభిషేకం, మహాపూర్ణాహుతి
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారికి సహస్ర ఘటాభిషేకం, సహస్ర నామార్చనలు వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 7 గంటలకు నిత్య హవనం, మూలమంత్ర జపములు, పారాయణములు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ఈఓ గీత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలో సాయంత్రం నృసింహ జయంతి మహోత్సవం, నృసింహ అవతార వైభవ ప్రవచనం గావించారు. అనంతరం మంత్రపుష్పనీరాజనములు నిర్వహించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...