పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి


Fri,May 17, 2019 02:44 AM

-అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు
-కౌంటింగ్‌ కేంద్రాలకు సెల్‌ అనుమతి లేదు కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌
నీలగిరి : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం కావాలని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు. ఈ నెల 23న పార్లమెంట్‌ ఎన్నికల నియోజకవర్గ ఓట్ల లెక్కింపుపై గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌తో కలిసి 7 అసెంబ్లీ నియోజకవర్గ నోడల్‌ అధికారులు, ఏఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఏఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు సమన్వయంతో పని చేసి ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గ లెక్కింపు దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో జరుగుతుందని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారులే ప్రతి పనిని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వారికి వివరించి కౌంటింగ్‌ నిర్వహణ తీరుపై వివరించాలన్నారు.

కౌంటింగ్‌ నిర్వహణకు కౌంటింగ్‌ హాల్‌లో, బయట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆర్వో టేబుల్‌పై పోస్టల్‌బ్యాలెట్లు, ఈటీపీబీఎస్‌ ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 5 వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ రోజున ఏజెంట్లు ఉదయం 6.30 గంటలకే హాజరు కావాలని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచేసమయానికి ఏజెంట్లు ఉండాలని పోలీస్‌ విచారణ ఉన్నందున ఏజెంట్ల నియామక పత్రాలను అభ్యర్థుల నుంచి శుక్రవారంలోగా సేకరించాలన్నారు.

కౌంటింగ్‌ హాలులోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ కౌం టింగ్‌ హాల్‌లో అధికారులు కౌంటింగ్‌కు కావల్సిన అన్ని ఏర్పాట్లు ఏఆర్‌ఓలు పూర్తి చేయాలన్నారు. విద్యుదాఘాతం జరుగకుండా, విద్యుత్‌ సరఫరా కౌం టింగ్‌కు అంతరాయం లేకుండా చర్య లు తీసుకోవాలని, జనరేటర్లు సిద్ధ్దంగా ఉంచుకోవాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ చంద్రశేఖర్‌, డీఆర్‌ఓ రవీంద్రనాథ్‌, సూర్యాపేట డీఆర్వో చంద్రయ్య, ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, జగన్నాథరావు, లింగ్యానాయక్‌ ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...