చీదెళ్లలో నిమ్మతోట దగ్ధం


Fri,May 17, 2019 02:41 AM

పెన్‌పహాడ్‌ : గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలు, తాలుకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించి నిమ్మతోట అంటుకొని దగ్ధ్దమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్ల గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బాల వెంకన్న తోట వెంట ఉన్న పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పంటించారు. వేసవి కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి తోట అంటుకుంది. నిమ్మచెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిమ్మకాయలు తెంపే తరుణంలో చెట్లు కాలిపోవడంతో రైతు కంటతడి పెట్టాడు. రూ.4లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...