డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అపశృతి


Fri,May 17, 2019 02:40 AM

-భవన నిర్మాణ కార్మికుడి మృతి
చిట్యాల : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల ని ర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణం జరుగుతున్న ఇంటిపైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.

ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం ఘటన వివరాలివి.. యాదాద్రిభువనగిరి జి ల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన రాయల గణే ష్‌(35) చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో డబుల్‌ బెడ్రూం నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సామగ్రిని పైకి చేర్చేందు కు లిఫ్టును సిద్ధ్దం చేస్తుండగా ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...